కొన్నేళ్ళుగా అనేక సామాజిక, దైవీకమైన కార్యక్రమములు
చేయుచు సనాతధర్మములో అనేకమంది ప్రయాణించేలా
చేస్తున్నది ' శ్రీ పరాశక్తి క్షేత్రము '.
శ్రీ పరాశక్తి క్షేత్ర నిర్మాణము
శ్రీ పరాశక్తి క్షేత్ర నిర్మాణమునకు భూదానము - నిర్మాణమునకు విరాళములు
శ్రీ పరాశక్తి క్షేత్రం నందు అనేకనేక ధార్మిక- ఆధ్యాత్మిక కార్యక్రమములు లోక కళ్యాణాఅర్థం జరుగుచున్నవి. ప్రస్తుతానికి ప్రదక్షిణ మార్గమున 13వ కిలోమీటరు వద్ద , రామాపురం రోడ్డు ప్రారంభములో, దక్షిణ కైలాస నగర్ వెంచర్ లో 400 గజముల స్థలము నందు ఈ కార్యక్రమాలు జరుగుచున్నవి. ముఖ్యంగా ప్రతీ పౌర్ణమికి అన్న ప్రసాద వితరణ జరుగుచున్నది.
- మంత్ర దీక్షలు
- మంత్రసాధనకు అనుకూలమైన వసతి-వాతావరణము
- కుటీరములు
- మంత్రసాధనకు అనుకూలమైన సాత్విక – ఆరోగ్యకరమైన భోజనము
- అనేక దేవీ దేవతల ప్రతిష్టలు
- అన్న ప్రసాదాలయము
- ధ్యాన మందిరము
- గోశాల
- మంత్రసాధనకు అవసరమైన యజ్ఞ మండపము
- సత్సంగ మందిరము
- ఇంకా అనేక ఔషధ గుణములు కలిగిన మొక్కలు
- వృక్షముల సముదాయము
- భక్తులకు సాధకులకు భోజనము కొరకు సేంద్రియ వ్యవసాయము చేయుటకు
ఇంకా ఎన్నో ఎన్నెన్నో వసతుల కొరకు దాదాపు 8 నుండి 10 ఎకరాల వరకు ఆధ్యాత్మిక వాతావరణము కలిగిన భూమి అవసరమవుతుంది.
ఇట్లు చేయబడిన నిర్మాణము ద్వారా ఎందరో భక్తులు ఈ ప్రదేశంలో పూజలు నిర్వహించుకుని వారి బాధలను పోగొట్టుకోవడానికి ఇదొక అద్భుతమైన క్షేత్రముగా వెలుగొందగలదు. ముఖ్యముగా సాధకులు ఒక మంత్ర దీక్ష పొందిన తరువాత ఈ ప్రదేశంలో కొద్ది రోజులు గానీ లేదా ఒక మండల(40 రోజులు ) దీక్ష గానీ సాధన చేసుకుని, చక్కగా పురస్చరణ హోమములు చేసుకోవచ్చును, దీక్ష కాలంలో చక్కటి ఆధ్యాత్మిక వాతావరణము, చక్కటి వసతి, సాత్విక- ఆరోగ్యకరమైన భోజనము ఇవన్నీ అందించవచ్చును.
కనుక భక్తులు ధార్మికులు, సనాతన ధర్మముపట్ల జిజ్ఞాస కలిగి శక్తిగలిగిన వారు ఇందుకు అవసరమైన భూదానము చేయగలరు. భూదానము వలన బ్రహ్మలోకప్రాప్తి కలుగుతుందని పురాణ వాక్కు. అలాగే ఈ క్షేత్ర నిర్మాణమునకు ధనరూపేణా – వస్తురూపేణా సహకారం అందించి శ్రీ పరాశక్తి క్షేత్ర అభివృద్ధికి తద్వారా సనాతన ధర్మమునకు సహకరించగలరు.