Sri Parasakthi Kshetram

పరాశక్తి క్షేత్రము

దేవ భూమి, తపోభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, యోగ భూమి అయినటువంటి మన భారత భూమి ఋషులకు, యోగులకు, మహా దేవీ దేవతలకు నిలయమైనది. భారత దేశం పేరు వింటేనే ఇది ఒక మహా శక్తి క్షేత్రంగా ప్రపంచానికి విశ్వగురు స్థానముగా మనకు భాసిస్తోంది. అష్టాదశ శక్తి పీఠములతో, ద్వాదశ జ్యోతిర్లింగాలతో, ఎందరో దేవి దేవతల శక్తి క్షేత్రములతో, ఋషుల పాదస్పర్శతో, మహనీయుల తపోక్షేత్రములతో నిత్యం సనాతన ధర్మంతో వర్ధిల్లుతున్నది మన భారత భూమి. ఇంతటి మహిమగల భారత భూమి నందు జన్మించాలని బయట దేశాల వారు కూడా తలపిస్తూ వుంటారు. మనందరి సౌభాగ్యం ఈ భారత భూమి నందు జన్మించి భగవంతుని మార్గంలో పయనిస్తున్నాము. మన ఊపిరి, మన ఆయువు, మన మార్గము సనాతన ధర్మము. జీవుడు ఉన్నత స్థితికి చేరుకోవటానికి, భగవదానుభూతి పొందటానికి, ఆత్మస్థితిని చేరుకోవటానికి, నేను- భగవంతుని చైతన్యం లోనుంచి వచ్చిన ఆత్మని, నేను -భగవంతుడు వేరు కాదు అనే అనుభూతి చెందటానికి కావాలసిన సాధనా సంపత్తిని అందించేదే మన సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మ మార్గంలో ప్రయాణిస్తూ సనాతన ధర్మ రక్షణ కోసం భక్తులను, సాధకులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నది ‘ శ్రీ పరాశక్తి క్షేత్రము’.

సిద్ధ గురువుల ఆశయానికి అనుగుణంగా గత కొన్నేళ్ళుగా అనేక సామాజిక, దైవీకమైన కార్యక్రమములు చేయుచు సనాతధర్మములో అనేకమంది ప్రయాణించేలా చేస్తున్నది ‘ శ్రీ పరాశక్తి క్షేత్రము ‘. పరురకాల సమస్యలతో భాదింపబడుతున్న అనేకులకు అనేక రకాల పూజల ద్వారా, హోమాల ద్వారా,దీక్షల ద్వారా, సమస్య నివారణ మార్గాల ద్వారా, మంత్ర దీక్షల ద్వారా వారి సమస్యలను తీరుస్తూ, తద్వారా వారికి భగవంతుని శక్తి పట్ల సనాతన ధర్మం పట్ల ఇంకా భక్తి,నమ్మకము గౌరవం పెరిగేలా చేస్తున్నది ‘ శ్రీ పరాశక్తి క్షేత్రము ‘.

మా కార్యక్రమాలు

మంత్ర దీక్ష సాధన

మంత్రసాధన చేయాలనుకునే వాళ్ళు రెండు రకాలుగా వుంటారు. మొదటి రకం వారు ఏదైనా సమస్య వచ్చింది, కష్టాలు వచ్చాయి, వాటి నుండి బయటపడాలి అనుకునేవారు మంత్ర దీక్షను పొంది, సాధన ద్వారా ఆ సమస్యలను తొలగించుకుంటారు.

అన్న సంతర్పణ

దక్షిణ కైలాస సిద్ధ క్షేత్రముగా ప్రసిద్ధిగాంచిన ఈ శ్రీకాళహస్తి క్షేత్రము నందు వెలసియున్న కైలాస పర్వతముల చుట్టూ ప్రతీ పౌర్ణమికి ప్రదక్షిణ చేయటం ప్రాచీన కాలం నుండి వస్తున్న సాంప్రదాయము.

యజ్ఞములు

మానవులకు నిత్యజీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిల్లో కొన్ని కొంత ప్రయత్నంతో అధిగమించవచ్చును. కొన్ని సమస్యలకు ఎంత ప్రయత్నించినా ఫలితం రాదు అటువంటి సందర్భంలో యజ్ఞముల ద్వారా చక్కటి పరిష్కారం చేయవచ్చును.

FEATURED VIDEOS

భక్తుల అనుభవాలు

నా పేరు సునీల్, మాది నంద్యాల. నేను గత కొన్నేళ్ళుగా మానసిక, శారీరిక సమస్యలతో బాధపడుతూ వుండేవాడిని. రేణుక అమ్మవారు మా ఇలవేల్పు. అమ్మవారికి బాగా పూజలు చేస్తూ వుంటాను. యూట్యూబ్ లో శ్రీ మాతాజీ గారిని చూసి సంప్రదించటం జరిగింది. శ్రీ మాతాజీ గారు నా ఆవేదనలను చాలా ఓర్పుతో విని నన్ను ఒక భక్తునిలా కాకుండా ఒక బిడ్డలా ఓదార్చి,ప్రేమతో నాకు మనోధైర్యాన్ని ఇచ్చింది. శ్రీ రేణుకా పరమేశ్వరి నామ మంత్రాన్ని నాకు ఉపదేశించి, ప్రతిరోజు సాధన చేయమన్నారు.శ్రీ రేణుకా పరమేశ్వరి చేరితామృతము గ్రంధాన్ని ఇచ్చి పారాయణ చేయమన్నారు. శ్రీ మాతాజీ గారు చెప్పినట్లుగానే అమ్మవారి నామ మంత్రాన్ని జపిస్తూ,అమ్మచరిత్ర పారాయణ చేసుకుంటూ, శ్రీ రేణుకా దేవికి పూజలు చేసుకుంటున్నాను. శ్రీ మాతాజీ గారు ఇచ్చిన సాధన వల్ల గత కొన్నేళ్లుగా నేను అనుభవిస్తున్న మానసిక - శారీరిక క్షోభనుండి బయటపడ్డాను.ఇప్పుడు నా స్టడీస్ లో ఇంకా బాగా ఫోకస్ చేయగలుగుతున్నాను. శ్రీ మాతాజీ గారు కర్నూల్ దగ్గర – శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టకు వచ్చినప్పుడు దర్శనం చేసుకోలేకపోయానని వెలితిగా ఉంది. శ్రీ మాతాజీ గారి దర్శనభాగ్యం అనుగ్రహించవలసిందిగా ప్రార్థన. శ్రీ మాతాజీ గారి పాదపద్మములకు ప్రణామములు.

సునీల్ , డిగ్రీ విద్యార్థి నంద్యాల

నా విషయంలో మాతాజీ గారు చెప్పిన ప్రతి విషయం చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మాతాజీ గారు ప్రేమతో నాకు సలహాలు - సూచనలు ఇచ్చి ధైర్యం చెప్పి ప్రోత్సహిస్తారు. యాగశాలలో దీపారాధన చేసే అవకాశం నాకు కల్పించారు. నా ఇద్దరు పిల్లలకు 'నామకరణము', 'అన్న ప్రాసన',' అక్షరాభ్యాసము' శ్రీ మాతాజీ గారి అమృత హస్తాలతో జరగటం చాలా ఆనందకరమైన విషయం. పెద్ద పాపకు 'మహాలక్ష్మి' అని, చిన్న పాపకు 'లోకేశ్వరి' అని పేరు పెట్టి అనుగ్రహించారు. అమ్మవారి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం నాకు కల్పించారు. కర్నూలు దగ్గర ఉడుములపాడు లోని ' శ్రీ రేణుక ఎల్లమ్మ' విగ్రహ ప్రతిష్టకు మాతాజీ గారు వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళారు.అదొక అద్భుతమైన దర్శనం. అక్కడ మాతాజీ గారు సాక్షాత్తు అమ్మవారి లాగా నాకు కనిపించారు. ఆ సమయంలోనే శ్రీ మాతాజీ గారితో కలిసి జోగులాంబ, మహానంది క్షేత్రాలను దర్శించే భాగ్యం కల్పించారు. మాతాజీ గారు అప్పుడప్పుడు స్వప్నంలో కనిపిస్తు వుంటారు. ఏదైనా భయంకరమైన కలలు వచ్చినప్పుడు, మాతాజీ గారు చెప్పిన 'శ్రీ రేణుక పరమేశ్వరి' నామాన్ని తలుచుకుంటే అంతటితో శాంతిస్తుంది. ఇంకా ఎన్నో అనుభవాలు వున్నాయి. శ్రీ మాతాజీ గారు జరిపించే అన్ని కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరుకుంటూ శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి పాదపద్మములకు, శ్రీ మాతాజీ గారి పాదపద్మములకు నమస్కారములు

పూడి అవినాష్ , మౌల్డ్ ఇంజనీర్ హైదరాబాద్

భక్తుల అనుభవాలు

Scroll to Top