మా లక్ష్యము

మన సనాతన ధర్మం ఎంతో గొప్పది. ఎందరో ఋషులు కఠోరమైన సాధనలు చేసి వారు దర్శించిన జ్ఞానాన్ని వేదాలు, ఉపనిషత్తులు, అనేక పురాణాల రూపంలో లోక కళ్యాణార్థం మనకి అందించారు. అలాగే అనేకమైన దివ్యమైన మంత్రములను మనకి అందించారు. నేటి సామాజిక పరిస్థితులలో అనేకనేకమైన సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతూ జీవిస్తున్నారు. అటువంటి వారికి వివిధ దేవీ దేవతల మంత్ర దీక్షల ద్వారా సాధనా మార్గంలో నడిపించి, వారికి చక్కటి పరిష్కారములు చేయుచున్నది ‘ శ్రీ పరాశక్తి క్షేత్రము’. అలాగే ఎటువంటి సమస్యలకైనను మహా దేవీ దేవతల యజ్ఞములు నిర్వహించి ప్రజల సమస్యలను శీఘ్రముగా నివారణ చేయటం జరుగుచున్నది.తద్వారా ప్రజలలో దైవం పట్ల నమ్మకం, భక్తి, గౌరవం ఇంకా ఇంకా పెరిగి సనాతన ధర్మం యొక్క గొప్పతనమును తెలుసుకునేలా చేయుచున్నది ‘శ్రీ పరాశక్తి క్షేత్రము’. అలాగే సాధనలో ఇంకా ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి, ఇష్టదేవతా దర్శనం పొందాలి, భగవతానుభూతిని పొందాలి అని తపించే వారి కోసం ప్రత్యేకమైన మంత్ర దీక్ష- సాధన ఇవ్వబడును. ఇటువంటివారు సాధన చేసుకోవటానికి అవసరమైన వాతావరణము, వసతి- తగిన ఆహారము అందించాలనేదే ‘ శ్రీ పరాశక్తి క్షేత్రము ‘ యొక్క ప్రధాన లక్ష్యము. దీని ద్వారా ఎంతో మంది సాధకులు దైవానికి దగ్గరవుతారు. భవిష్యత్తులో వీరు కూడా సనాతనధర్మమునకు గొప్ప సేవ చేయగల మార్గదర్శకులు కావాలని మా లక్ష్యం.

Scroll to Top