సునీల్ , డిగ్రీ విద్యార్థి
నంద్యాల
నా పేరు సునీల్.నేను డిగ్రీ విద్యార్థిని. నేను గత కొన్నేళ్ళుగా మానసిక, శారీరిక సమస్యలతో బాధపడుతూ వుండేవాడిని. రేణుక అమ్మవారు మా ఇలవేల్పు. అమ్మవారికి బాగా పూజలు చేస్తూ వుంటాను. యూట్యూబ్ లో శ్రీ మాతాజీ గారిని చూసి సంప్రదించటం జరిగింది. శ్రీ మాతాజీ గారు నా ఆవేదనలను చాలా ఓర్పుతో విని నన్ను ఒక భక్తునిలా కాకుండా ఒక బిడ్డలా ఓదార్చి,ప్రేమతో నాకు మనోధైర్యాన్ని ఇచ్చింది. శ్రీ రేణుకా పరమేశ్వరి నామ మంత్రాన్ని నాకు ఉపదేశించి, ప్రతిరోజు సాధన చేయమన్నారు.శ్రీ రేణుకా పరమేశ్వరి చేరితామృతము గ్రంధాన్ని ఇచ్చి పారాయణ చేయమన్నారు. శ్రీ మాతాజీ గారు చెప్పినట్లుగానే అమ్మవారి నామ మంత్రాన్ని జపిస్తూ,అమ్మచరిత్ర పారాయణ చేసుకుంటూ, శ్రీ రేణుకా దేవికి పూజలు చేసుకుంటున్నాను. శ్రీ మాతాజీ గారు ఇచ్చిన సాధన వల్ల గత కొన్నేళ్లుగా నేను అనుభవిస్తున్న మానసిక – శారీరిక క్షోభనుండి బయటపడ్డాను.ఇప్పుడు నా స్టడీస్ లో ఇంకా బాగా ఫోకస్ చేయగలుగుతున్నాను. శ్రీ మాతాజీ గారు కర్నూల్ దగ్గర – శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టకు వచ్చినప్పుడు దర్శనం చేసుకోలేకపోయానని వెలితిగా ఉంది. శ్రీ మాతాజీ గారి దర్శనభాగ్యం అనుగ్రహించవలసిందిగా ప్రార్థన. శ్రీ మాతాజీ గారి పాదపద్మములకు ప్రణామములు.