శ్రీకాళహస్తి క్షేత్ర వైభవం

శ్రీకాళహస్తీశ్వరుని కొండ చుట్టూ ప్రదక్షిణ

24 కిలోమీటర్లు చుట్టు మార్గము కలిగిన ఈ క్షేత్రము నందు ప్రదక్షిణ చేయటం అనాదిగా వస్తున్న సాంప్రదాయము.
శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు పరమచార్యులు శ్రీ చంద్ర శేఖరేంద్రసరస్వతీ స్వామివార్లు కూడా ఈ క్షేత్రంలో ప్రదక్షిణ చేస్తే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని సెలవిచ్చి ఉన్నారు. ఇటీవలికాలంలో మహనీయులు కూడా ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయమని భక్తులను ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రదక్షిణ కొరకు దక్షిణ కైలాస పర్వతాలను కలుపుతూ కొండ మార్గములోని వివిధ దేవతా క్షేత్రములను అనుసంధానం చేస్తూ దేవస్థానమును వారు చేసి చాలా అద్భుతముగా రోడ్డు మార్గమును నిర్మించియున్నారు.

ప్రదక్షణ ఎలా చేయాలి - ఫలితాలు ఏమిటి?

భక్తుడు తన మనస్సును భగవంతుని మీద నిలిపి
భగవంతుడిని స్మరణ చేస్తూ, కాలినడకన కొండనే పరమేశ్వరుడిగా భావించి ప్రదక్షిణ చేయటం వలన ఆ పరమేశ్వరుని చూపు ఆయా భక్తుల మీద ప్రసరిస్తుంది. అంతేకాకుండా ఇక్కడున్న సప్త ఋషుల దృష్టి కూడా భక్తుల మీద ప్రసరిస్తుంది. దైవం యొక్క దృష్టి భక్తుల మీద ప్రసరించాలంటే భక్తులు అంతటి భక్తి శ్రద్ధలతో పాటించి ప్రదక్షిణ చేయుట ఎంతైనా శ్రేయస్కరమాని మహనీయులు చెబుతారు. మాములుగా హడావిడిగా సెల్ఫోన్ మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ కాకుండా పైన చెప్పిన విధంగా భక్తిగా ప్రదక్షిణ చేయాలి.

ప్రదక్షిణ చేసేవారికి మహా అన్న ప్రసాద వితరణ...

గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ రేణుకా పీఠము ద్వారా ఎన్నో ప్రదేశాలలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అదే సత్ సంకల్పముతో ఈ శ్రీకాళహస్తి మహా క్షేత్రము నందు కూడా ప్రతి పౌర్ణమికి ‘శ్రీ పరమేశ్వర పరాశక్తి మహా అన్న ప్రసాద వితరణ’ గత కొంతకాలంగా జరుపబడుచున్నది. ముఖ్యంగా శ్రీకాళహస్తీశ్వర కొండ చుట్టూరు ప్రదక్షిణ చేసే భక్తుల సౌకర్యార్థo, ప్రదక్షిణ మార్గములోని 13 వ మైలు వద్ద ( దక్షిణ కైలాస మండపము దాటిన తర్వాత ) రామాపురం రోడ్డు ప్రారంభంలో ఉన్నటువంటి దక్షిణ కైలాస నగర్ ( కొత్త వెంచర్ )లో వెలసినటువంటి ‘శ్రీ పరాశక్తి క్షేత్రము’ నందు మహా అన్నప్రసాద వితరణ జరుపబడుచున్నది. ప్రదక్షిణ చేసే భక్తులు వినియోగించుకోగలరని మా ప్రార్ధన.

ఈ యొక్క లోకకళ్యాణ కార్యము నందు ధన - వస్తు - సేవ రూపేణా పాలుపంచుకోదలచిన వారు సంప్రదించగలరు. మీరు పంపిన విరాళముల వివరాలు, మీ గోత్రనామాలను వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయగలరు.

9885968678

విరాళములు ఇవ్వదలచిన వారు ఈ క్రింది నెంబర్కు పంపగలరు – ఫోన్ పే/ గూగుల్ పే : 9030968678.

Scroll to Top