కొన్నేళ్ళుగా అనేక సామాజిక, దైవీకమైన కార్యక్రమములు
చేయుచు సనాతధర్మములో అనేకమంది ప్రయాణించేలా
చేస్తున్నది ' శ్రీ పరాశక్తి క్షేత్రము '.
మంత్ర దీక్ష సాధన
వివిధ రకాల సమస్యల నివారణకు అద్భుతమైన దేవీ దేవతల మంత్ర దీక్ష సాధనలు
మంత్రసాధన చేయాలనుకునే వాళ్ళు రెండు రకాలుగా వుంటారు. మొదటి రకం వారు ఏదైనా సమస్య వచ్చింది, కష్టాలు వచ్చాయి, వాటి నుండి బయటపడాలి అనుకునేవారు మంత్ర దీక్షను పొంది, సాధన ద్వారా ఆ సమస్యలను తొలగించుకుంటారు.
ఇక మరోరకం వారు “దేవత సాధన చేయాలి, దేవత దర్శనం పొందాలి, దేవత శక్తిని పొందాలి, సిద్ధ శక్తులను సాధించాలి, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవాలి”. అని భావించి ఆ విధమైన సాధన చేస్తారు.
ఇలా ఎటువంటి సమస్యలైన, దేవీ దేవతల ప్రత్యేక మైన మంత్ర సాధనల ద్వారా అన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోవచ్చు. దైవానుగ్రహాన్ని పొందవచ్చు.
- మంత్ర దీక్ష తీసుకోవాలి- సాధన చేయాలి అని భావించే వారికి 'శ్రీ మాతాజీ గారు' మంత్రసాధన దీక్షను అనుగ్రహిస్తారు. అటుపైన మంత్రసాధన ఎలా చేయాలి, దానికి అవసరమైన విధివిధానాలను 'శ్రీ పరాశక్తి క్షేత్రము' నుండి మీకు అన్ని విశేషాలు అందించబడుతాయి .
- మంత్రసాధనలు చేయండి- మీ ఇబ్బందులు మీరే తొలగించుకోండి. సనాతన ధర్మ మార్గంలో పయనించండి.
- మంత్ర దీక్ష అప్పాయింట్మెంట్ కొరకు ముందుగా సంప్రదించగలరు.