కొన్నేళ్ళుగా అనేక సామాజిక, దైవీకమైన కార్యక్రమములు
చేయుచు సనాతధర్మములో అనేకమంది ప్రయాణించేలా
చేస్తున్నది ' శ్రీ పరాశక్తి క్షేత్రము '.
పౌర్ణమి పూజలు
16 కళలతో అద్భుతమైన దివ్యమైన శక్తులతో నిండి ఉన్న పూర్ణ పౌర్ణమి ఘడియల యందు చేసే ఏ చిన్న పాటి
- పూజలు
- ఆరాధనలు
- మంత్ర సాధనలు
- సేవా కార్యక్రమాలు
ఎన్నో రెట్లు గొప్ప ఫలితాలను ఇస్తుంది. భక్తుల, సాధకుల మనోభీష్టాలు నెరవేరుటకు ‘శ్రీ రేణుకా పరమేశ్వరి’ అమ్మవారికి ప్రత్యేకమైన
- అభిషేకాలు
- అలంకరణలు
- వివిధ రకాలైన నైవేద్యాలు
సమర్పించబడును. అలాగే పౌర్ణమి నిండు వెన్నెలలో ‘ ప్రత్యేకమైన ధ్యానము’ చేయబడును.
భక్తులు, సాధకులు ఈ యొక్క దైవీకమైన ప్రణాళికలో పాల్గొని దైవకృపను అనుభూతి చెందెదరు గాక. ఇలాంటి ఇలాంటి బృహత్తరమై లోక కళ్యాణ కార్యక్రములను నిర్వహించుటకు
అవసరమైన సహకారమును ధనరూపేణా- వస్తురూపేణా – సేవరూపేణా అందించగలరు.