శ్రీ పరాశక్తి క్షేత్ర నిర్మాణము

శ్రీ పరాశక్తి క్షేత్ర నిర్మాణమునకు భూదానము - నిర్మాణమునకు విరాళములు

శ్రీ పరాశక్తి క్షేత్రం నందు అనేకనేక ధార్మిక- ఆధ్యాత్మిక కార్యక్రమములు లోక కళ్యాణాఅర్థం జరుగుచున్నవి. ప్రస్తుతానికి ప్రదక్షిణ మార్గమున 13వ కిలోమీటరు వద్ద , రామాపురం రోడ్డు ప్రారంభములో, దక్షిణ కైలాస నగర్ వెంచర్ లో 400 గజముల స్థలము నందు ఈ కార్యక్రమాలు జరుగుచున్నవి. ముఖ్యంగా ప్రతీ పౌర్ణమికి అన్న ప్రసాద వితరణ జరుగుచున్నది.

  • మంత్ర దీక్షలు
  • మంత్రసాధనకు అనుకూలమైన వసతి-వాతావరణము
  • కుటీరములు
  • మంత్రసాధనకు అనుకూలమైన సాత్విక – ఆరోగ్యకరమైన భోజనము
  • అనేక దేవీ దేవతల ప్రతిష్టలు
  • అన్న ప్రసాదాలయము
  • ధ్యాన మందిరము
  • గోశాల
  • మంత్రసాధనకు అవసరమైన యజ్ఞ మండపము
  • సత్సంగ మందిరము
  • ఇంకా అనేక ఔషధ గుణములు కలిగిన మొక్కలు
  • వృక్షముల సముదాయము
  • భక్తులకు సాధకులకు భోజనము కొరకు సేంద్రియ వ్యవసాయము చేయుటకు

ఇంకా ఎన్నో ఎన్నెన్నో వసతుల కొరకు దాదాపు 8 నుండి 10 ఎకరాల వరకు ఆధ్యాత్మిక వాతావరణము కలిగిన భూమి అవసరమవుతుంది.

ఇట్లు చేయబడిన నిర్మాణము ద్వారా ఎందరో భక్తులు ఈ ప్రదేశంలో పూజలు నిర్వహించుకుని వారి బాధలను పోగొట్టుకోవడానికి ఇదొక అద్భుతమైన క్షేత్రముగా వెలుగొందగలదు. ముఖ్యముగా సాధకులు ఒక మంత్ర దీక్ష పొందిన తరువాత ఈ ప్రదేశంలో కొద్ది రోజులు గానీ లేదా ఒక మండల(40 రోజులు ) దీక్ష గానీ సాధన చేసుకుని, చక్కగా పురస్చరణ హోమములు చేసుకోవచ్చును, దీక్ష కాలంలో చక్కటి ఆధ్యాత్మిక వాతావరణము, చక్కటి వసతి, సాత్విక- ఆరోగ్యకరమైన భోజనము ఇవన్నీ అందించవచ్చును.

కనుక భక్తులు ధార్మికులు, సనాతన ధర్మముపట్ల జిజ్ఞాస కలిగి శక్తిగలిగిన వారు ఇందుకు అవసరమైన భూదానము చేయగలరు. భూదానము వలన బ్రహ్మలోకప్రాప్తి కలుగుతుందని పురాణ వాక్కు. అలాగే ఈ క్షేత్ర నిర్మాణమునకు ధనరూపేణా – వస్తురూపేణా సహకారం అందించి శ్రీ పరాశక్తి క్షేత్ర అభివృద్ధికి తద్వారా సనాతన ధర్మమునకు సహకరించగలరు.

' శ్రీ పరాశక్తి క్షేత్రము ' గురించి మరింత సమాచారం కొరకు సంప్రదించగలరు – శ్రీ వెంకట్ స్వామి - 9885968678

Scroll to Top