కొన్నేళ్ళుగా అనేక సామాజిక, దైవీకమైన కార్యక్రమములు
చేయుచు సనాతధర్మములో అనేకమంది ప్రయాణించేలా
చేస్తున్నది ' శ్రీ పరాశక్తి క్షేత్రము '.
కార్యక్రమాలు
- ప్రతి పౌర్ణమికి, అమావాస్యకు మరియు కొన్ని ప్రత్యేకమైన పర్యదినాలలో అన్నప్రసాద వితరణ జరుపబడును.
- అన్ని రకాలైన సమస్యల నుండి బయటపడుటకు వివిధ దేవీ దేవతల మంత్ర దీక్షలు ఇవ్వబడును.
- అన్ని సమస్యల నివారణకు, శత్రు భాదా నివారణకు, దుష్ట ప్రయోగ పీడ నివారణకు, ఆరోగ్య సిద్ధికి, ఆర్థిక ఐశ్వర్య అభివృద్ధికి, వివాహ సిద్ధికి, దుష్ట గ్రహ పీడా నివారణకు, భూమి- స్థలము వివాదాలు తొలగటానికి, రైతులకు పంటలు బాగా పండటానికి, సత్ - సంతాన ప్రాప్తికి, ఉద్యోగ ప్రాప్తికి, నరదృష్టి- నరఘోష నివారణకు, మొదలైన అన్ని ఇబ్బందులు తొలగటానికి, ఇష్ట కామ్య సిద్ధికి లక్ష్మీగణపతి, ప్రత్యంగిరా, రేణుక, చిన్నమస్తా, కాళీ -కాలభైరవ, స్వర్ణ కుబేర, రాజశ్యామల మొదలైన దేవీదేవతల యజ్ఞములు సామూహికముగాను, ప్రత్యేకముగాను చేయబడును.
- సమస్యల నివారణ, బాదా నివారణకు ప్రత్యేక పూజలు చేయబడును.తగిన సూచనలు -సలహాలు అందించబడును.