కొన్నేళ్ళుగా అనేక సామాజిక, దైవీకమైన కార్యక్రమములు
చేయుచు సనాతధర్మములో అనేకమంది ప్రయాణించేలా
చేస్తున్నది ' శ్రీ పరాశక్తి క్షేత్రము '.
అన్నసంతర్పణ
ప్రతి పౌర్ణమికి అన్న సంతర్పణ
దక్షిణ కైలాస సిద్ధ క్షేత్రముగా ప్రసిద్ధిగాంచిన ఈ శ్రీకాళహస్తి క్షేత్రము నందు వెలసియున్న కైలాస పర్వతముల చుట్టూ ప్రతీ పౌర్ణమికి ప్రదక్షిణ చేయటం ప్రాచీన కాలం నుండి వస్తున్న సాంప్రదాయము. మొత్తం 24 కిలోమీటర్లు ప్రదక్షిణ మార్గం కలిగిన ఈ కైలాస క్షేత్రంలో ఎందరో భక్తులు సాధకులు ఎంతో భక్తి శ్రద్ధలతో పౌర్ణమి మరియు కొన్ని ప్రత్యేకమైన తిధి నక్షత్రములలో ప్రదక్షిణ చేస్తారు. పౌర్ణమి సమయంలో ప్రదక్షిణ చేసే భక్తులకు శ్రీ పరాశక్తి క్షేత్రము నందు అన్న ప్రసాద వితరణ చేయటం గత కొంతకాలంగా జరుగుచున్నది.
ఈ మహా అన్న ప్రసాద వితరణ లోక కళ్యాణ కార్యము విజయవంతముగా కొనసాగుటకు ధర్మాత్ములైన భక్తుల నుండి విరాళములను ధన రూపేణా వస్తురూపేణా కోరుచున్నాము. ఫోన్ పే / గూగుల్ పే:- 9030968678
మరిన్ని వివరాలకు ఈ నెంబర్కు సంప్రదించండి మరియు మీరు పంపిన విరాళముల వివరాలు వాట్సాప్ చేయగలరు 9885968678